Utilize services of transgenders as traffic volunteers: సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రాన్స్‌జెండర్లను వాలంటీర్లుగా నియమించుకునే అవకాశాలను పరిశీలించుకోవాలని ట్రాఫిక్‌పై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యలను సులభతరం చేయడానికి సీఎం ముందుకొచ్చిన వినూత్న ఆలోచన ఇప్పుడు హాట్ టాపిక్ గా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇందులో భాగంగా ట్రాఫిక్ స్ట్రీమ్‌లైన్ చేయడంలో ట్రాన్స్‌జెండర్లను వాలంటీర్స్‌గా ఉపయోగించుకోవాలని సూచించారు.
హోంగార్డుల తరహాలో వారికి శిక్షణ ఇచ్చి వారి సహాయం తీసుకోవాలని వివరించారు. ఆసక్తి ఉన్నవారి వివరాలను సేకరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి ఉపాధి అవకాశాలు కల్పిచడంతోపాటు వారికి సమాజంలో గౌరవం తీసుకురావొచ్చాన్నారు. అంతే కాకుండా, నగర ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంలో కూడా ఒక కొత్త మార్గం చూపించినట్లు అవుతుందని భావిస్తున్నారన్నారు.