ప్రతిపక్షం, తెలంగాణ: హోటల్ వెస్టిన్‌లో CII తెలంగాణ ఆధ్వర్యంలో “విద్య, నైపుణ్యాభివృద్ధి & వ్యవస్థాపక అవకాశాలు” అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే మా విధానమని.. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు అన్నివిధాలుగా అండగా ఉంటామని పేర్కొన్నారు. రాజకీయాలు ఎలా ఉన్నా వైఎస్, చంద్రబాబు, కేసీఆర్ హైదరాబాద్ అభివృద్ధిని కొనసాగించారన్నారు.
అభివృద్ధి విషయంలో మా ప్రభుత్వానికి ఎలాంటి బేషజాలు లేవు.. నగర అభివృద్ధి కోసం గత పాలకులు తీసుకున్న మంచి నిర్ణయాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో విద్య, ఉపాధి అవకాశాల కల్పనలో సీఐఐ తో కలిసి ముందుకు నడుస్తామని.. 64 ఐటీఐ లను స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లుగా రూ.2000 కోట్లలతో డెవలప్ చేయబోతున్నామని తెలిపారు. స్కిల్లింగ్ యూనివర్సిటీల ఏర్పాటు కోసం సంప్రదింపులు జరపడంతో పాటుగా.. స్కిల్ డెవలప్ మెంట్ లో జాయిన్ అయిన విద్యార్థులకు డిగ్రీ సర్టిపికెట్స్ ఇవ్వబోతున్నట్టు తెలిపారు.