Trending Now

ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ ధాన్యం కొనుగోళ్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘‘ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. రైతుల కష్టాన్ని ఎవరైనా మార్కెట్ కమిటీ అధికారులు.. వ్యాపారులతో కుమ్మక్కై తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదు’’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఇవాళ ట్వీట్ చేశారు.

జనగామ వ్యవసాయ మార్కెట్ లో జరిగిన ఘటనపై సకాలంలో స్పందించి, రైతులను మోసం చేయడానికి ప్రయత్నించిన నలుగురు ట్రేడర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని సీఎం ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన మార్కెట్ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని ఆదేశించిన అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ అభినందనలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులందరూ ధాన్యం కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Spread the love

Related News

Latest News