Trending Now

‘సిద్దిపేట నుండి సిరిసిల్లాకు రైల్వే లైన్ భూసేకరణ వేగవంతం చేయండి’

ప్రతిపక్షం, సిద్దిపేట: సిద్దిపేట నుండి సిరిసిల్లా కు రైల్వే లైన్ భూసేకరణ జిల్లాలోని చిన్నకోడూరు, నారాయణరావు పేట మండలాల్లో పెండింగ్ లో ఉన్న భూ సేకరణ ప్రక్రియ ను వేగంగా పూర్తి చెయ్యాలని రెవెన్యూ అధికారులను జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో రైల్వే ప్రాజెక్టు ముఖ్య అధికారులు, రెవెన్యూ అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో సిద్దిపేట వరకు రైల్వే పనులు పూర్తి అయ్యాయని.. జిల్లాలో చిన్నకోడూరు, నారాయణ రావు పేట మండలాల్లో పెండింగ్ లో ఉన్న భూ సేకరణ వివరాలు గూర్చి రైల్వే అధికారులు కలెక్టర్ కి తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చిన్నకోడూరు, నారాయణరావు పేట మండలాల్లో పెండింగ్ లో ఉన్న భూసేకరణను క్షేత్ర స్థాయిలో పరిశీలించి వివరాలను సేకరించాలని ఆయా మండల తహసీల్దార్ లకు ఆదేశించారు. రైల్వే లైన్ మాత్రమే కాకుండా పెండింగ్ లో ఉన్న సర్వీస్ రోడ్ భూసేకరణ సైతం పూర్తి చెయ్యాలని సూచించారు. భూసేకరణను వేగంగా పూర్తి చేసి రైల్వే అధికారులకు అప్పగించాలని తెలిపారు. ఈ సమావేశం లో ఆర్డిఓ పి. సదానందం, రైల్వే ప్రాజెక్టు చీప్ ఇంజినీర్ అమిత్ అగర్వాల్, డిప్యూటీ చీప్ ఇంజనీర్ సంతోష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News