జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం. మనుచౌదరి..
ప్రతిపక్షం, సిద్దిపేట, మే 02: లోక్ సభ ఎన్నికల్లో భాగంగా జిల్లాలొ ఓటింగ్ శాతం పెంచేందుకు సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ (SVEEP)ప్రోగ్రామ్ కార్యకలాపాల్లో గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్ చాంబర్ లో గజ్వేల్ పట్టణానికి చెందిన రాయరావు విశ్వేశ్వర రావు స్వయంగా రచన, స్వర కల్పనలో రూపుదిద్దుకున్న ఓటరు చైతన్య పాట – “ఓటు వేయ్” అనే పాట ఆడియో ఆవిష్కరణ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం. మనుచౌదరి చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఓటింగ్ శాతం పెంచేందుకు పెద్ద ఎత్తున పలు రకాల సోషల్ మీడియాలో ఈ పాటను ప్రచారం చేయ్యాలని సూచించారు.
SVEEP కార్యకలాపాలు కూడా నైతిక ఓటింగ్‌కు సంబంధించి ఓటర్లకు అందుబాటులో ఉన్న వివిధ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ సౌకర్యాల గురించి తెలియజేయడానికి ఉద్దేశించబడ్డాయి, ఓటు వేయడం ఎలా, ఎన్నికల సమయంలో అవినీతి పద్ధతులను నిరోధించడానికి ఎన్నికల యంత్రాంగానికి ఎలా సహాయం చేయాలి. సాధారణ ఓటర్లకు అవగాహన కోసం, SVEEP కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా SVEEP నోడల్ అధికారి జయదేవ్ ఆర్యా, జిల్లా మాస్టర్ ట్రైనర్ అయోధ్య రెడ్డి, రామస్వామి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్ ప్రక్కన గల ఈవీఎం గోదాంలో జరుగుతున్న ఈవీఎం మీషన్ ల ఫస్ట్ లెవల్ చెకింగ్ పనులను జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.