ప్రతిపక్షం, హుస్నాబాద్, మే 9 : కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో భాగంగా కరీంనగర్ పార్లమెంటు జనరల్ అబ్జర్వర్ అమిత్ కటారియా, సిద్దిపేట కలెక్టర్ మను చౌదరి గురువారం ఆఫీసర్లతో ఎన్నికల విధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా ఎన్నికలకు నిర్వహణలో హుస్నాబాద్ ఐఓసీ బిల్డింగ్ లో నిర్వహిస్తున్న ఫెసిలిటేషన్ సెంటర్స్ సందర్శించి అందులో నిర్వహిస్తున్న ప్రతి కౌంటర్ ను పరిశీలించి తగిన జాగ్రత్తలు తీసుకోవలసినదిగా కోరారు. మే 10వ తేదీ వరకు ఇట్టి సెంటర్స్ నిర్వహించబడునని ప్రభుత్వ ఉద్యోగులు ఓటు హక్కు కలిగి ప్రతి ఒక్కరు తమ తమ ఓటును హక్కును వినియోగించుకోవలసినది గా కోరారు. ఎన్నికల నిర్వహణలో అత్యంత పకడ్బందీ నిర్వహించవలసిన ప్రక్రియ స్ట్రాంగ్ రూమ్ నిర్వహణ.. స్ట్రాంగ్ రూమ్ ఐఓసీ బిల్డింగ్ లో హుస్నాబాద్ మోడల్ స్కూల్ లో నిర్వహిస్తున్న స్ట్రాంగ్ రూములను పర్యవేక్షించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. హుస్నాబాద్ బాయ్స్ హై స్కూల్ లోని పోలింగ్ కేంద్రం నెంబర్ 6 ,7 ,8 లను సందర్శించి ఓటర్ల వివరాలను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వి. రామ్మూర్తి, హుస్నాబాద్ తహాసీల్దార్ రవీందర్ రెడ్డి, ఎన్నికల డిప్యూటీ తహాసీల్దారు రుక్మిణి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.