ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 16 : నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమై, జిల్లా స్థాయి దోస్త్ సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేశామని గురువారం కళాశాల ప్రిన్సిపాల్ భీమా రావు తెలిపారు. దోస్త్ ప్రక్రియ ద్వారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మల్ లో ప్రవేశం పొందాలని సూచించారు. దోస్త్ నమోదు ప్రక్రియలో విద్యార్థులకు ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు ఎదురైతే కళాశాలకు వచ్చి సహాయక కేంద్రంలో పరిష్కారం పొందవచ్చని కోరారు. ఈ సదుపాయంను నిర్మల్ జిల్లా లోని ఆయా మీడియంలో చదువుతున్న విద్యార్థులంతా సద్వినియోగపరుచుకోవాలని సూచించారు.
డిగ్రీ కళాశాలలో సీట్ల భర్తి కొరకు మే 6వ తేదీ నుండి రిజిస్ట్రేషన్స్ లు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రవేశాల ప్రక్రియ మూడు విడతల్లో జరుగుతుందన్నారు. మొదటి విడత 6.5.2024 నుండి 29.5.2024 వరకు. రెండవ విడత 6.6.2024 నుండి 13.6.2024 వరకు మూడవ విడత 19.6.2024 నుండి 25.6.2024 వరకు. జులై 8వ తేదీ నుండి మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం అవుతాయని తెలిపారు. విద్యార్థులు ఆధార్ కార్డు నెంబర్, మొబైల్ నెంబర్ లకు అనుసంధానమై ఉండాలని పేర్కొన్నారు.
దోస్త్ రిజిస్ట్రేషన్ కొరకు పదో తరగతి మెమో, ఇంటర్ రెండవ సంవత్సరం హాల్ టికెట్ నెంబర్, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం 05.05. 2024 తర్వాత తీయబడినవి మాత్రమే ఉండాలని సూచించారు. 4వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్స్, ఆధార్ కార్డు నెంబర్, పాస్ పోర్ట్ ఫోటోలు కూడా తీసుకురావాలని తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో దోస్త్ జిల్లా స్థాయి కన్వీనర్ యు. రవి కుమార్, సాంకేతిక సహాయ అధ్యాపకులు దిలీప్ కుమార్ అధ్యాపకులు డా. పి జి రెడ్డి, డా. అజయ్, మురళి, దోస్త్ రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన విద్యార్థులు పాల్గొన్నారు.