ఆస్తిపన్ను చెల్లించండి .. 5 శాతం రాయితీ పొందండి..
జీహెచ్ఎంసీ కమిషనర్ డి. రోనాల్డ్ రోస్
ప్రతిపక్షం, హైదరాబాద్, ఏప్రిల్ 26: జీహెచ్ఎంసీ కల్పించిన ఎర్లీబర్డ్ పథకానికి మిగిలింది ఐదు రోజులేనని కమిషనర్ డి. రోనాల్డ్ రోస్ ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ నెల 30 లోపు ఆస్తిపన్నును చెల్లించి, ఎర్లీబర్డ్ పథకం కింద 5 శాతం పన్ను రాయితి పొందాలని సూచించారు. గతంలో నివాస గృహాలకు మాత్రమే పరిమిత స్థాయిలో పన్ను రాయితి ఉండేదని, వివిధ వర్గాల నుండి అందిన విజ్ఞాపనల మేరకు వాణిజ్య ఆస్తులు, మిక్స్‌డ్ గృహాలకు కూడా పన్ను రాయితిని వర్తింపజేస్తూ జీహెచ్ఎంసీ వెసులుబాటు కల్పించిందని కమిషనర్ చెప్పారు. ఆస్తిపన్నును ఆన్‌లైన్, సిటీజన్ సర్వీస్ సెంటర్లు, ఈ-సేవా కేంద్రాల ద్వారా చెల్లించవచ్చునని సర్కిల్ ,హెడ్ ఆఫీస్ లో ఉన్న సిటిజెన్ సర్వీస్ సెంటర్లు ఉదయం ,8 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు చెళ్ళించవచ్చునని ఆయన తెలిపారు. అలాగే ఇంటి వద్దకు వచ్చే బిల్ కలెక్టర్లకు కూడా నేరుగా ఆస్తిపన్ను చెల్లించి, రాయితితో కూడిన రశీదులను పొందాలన్నారు. అంతే కాకుండా ఆన్ లైన్ మై జీహెచ్ఎంసీ యాప్ ద్వారా అస్తి పన్ను చెల్లించే వెసులు బాటు ఉందన్నారు. ఐటీ కంపెనీలు, మల్టీలేవల్ మాల్స్, స్టార్ హోటల్స్, వ్యాపార సంస్థలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కమిషనర్ రోనాల్డ్ రోస్ సూచించారు.