ప్రతిపక్షం, వెబ్ డెస్క్: రాష్ట్ర రాజకీయాల్లో హాట్ సీటు విజయవాడ పార్లమెంట్ స్థానం. గతంలో రాజకీయ ఉద్దండులు ఇక్కడి నుంచి గెలిచి ప్రభుత్వంలో చక్రం తిప్పారు. కాగా ఇక్కడ తొలిసారిగా అన్నదమ్ములు ఈసారి బరిలోకి దిగుతున్నారు. YCP నుంచి కేశినేని నాని, TDP తరఫున నాని తమ్ముడు కేశినేని చిన్ని బరిలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో YCP ప్రభంజనంలోనూ TDP గెలిచిన MP సీటు ఇది. మరి బెజవాడ గడ్డపై ఈసారి ఎవరి జెండా ఎగురుతుందో చూడాలి.