రైతన్నలను ఆదుకోవాలని నిర్మల్‌లో బీఆర్‌ఎస్ శ్రేణుల రాస్తారోకో..
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 16 : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఝూట మాటలతో రాష్ట్ర ప్రజలను అడుగడుగున మోసం చేస్తున్నాడని బీఆర్ఎస్ నిర్మల్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము ఆరోపించారు. గురువారం మధ్యాహ్నం నిర్మల్ పట్టణంలోని మౌలానా ఆజాద్ చౌక్ లో రైతుల ధాన్యం కొనుగోల నిర్లక్ష్యం పై రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ధోరణికి నిరసనగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు రాస్తారోకో కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని వర్గాలకు అడగడుగున మోసాలు చేస్తున్నాడని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మాయమాటలతో పబ్బం కడుకుంటున్నాడని మండిపడ్డరు.
వ్యవసాయ రైతులను అధోగతి పాలు చేయడమే కాకుండా ఆపత్కాలంలో ఆదుకోవడం పోయి వారికి కొత్త రకమైన టెన్షన్లు పెడుతున్నాడని విమర్శించారు. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులందరినీ తగిన విధంగా ఆదుకొని పంట నష్టపోయిన వారికి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చే ఆదేశాలు సూచనల మేరకు బీఆర్ఎస్ భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ఆందోళనలు చేపడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు పట్టణ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీరుద్దీన్ నెల అనిల్ కుమార్, కుమార్, మొహమ్మద్ బిన్ అలీ,రిజ్వాన్ ఖాన్ ,మొహమ్మద్ హబీబ్, సయ్యద్ ఖాజా అక్రం అలీ,శేఖ్ అజీజ్ ,శేఖ్ మునీర్, మొహమ్మద్ అజీజ్, మహమ్మద్ షౌకత్, నర్సయ్య, శివాజీ లతోపాటు పలువురు పాల్గొన్నారు. రాస్తారోకో కారణంగా రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుండడంతో పట్టణ పోలీసులు జోక్యం చేసుకొని ఆందోళన కారులను శాంతింప చేశారు బీఆర్ఎస్ రేణువులు నినాదాలు చేస్తూ తమ ఆందోళనలు చేపట్టారు.