ప్రతిపక్షం, ఏపీ: ఏపీ రాజకీయాల్లో ఎన్నికల ప్రచారాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీలు బహిరంగ సభలతో హోరెత్తిస్తుండగా, ప్రచారాలు పీక్స్ వెళ్లాయి. బ్యానర్ల ద్వారా, పార్టీ కండువాలు, టీ షర్టుల ద్వారా, బొట్టుబిల్లల ద్వారా ప్రచారాలు జరగగా.. ఇప్పుడు ఏకంగా కండోమ్ పాకెట్ల ద్వారా ప్రచారాలు జరుగుతున్నాయి. అమ్మవడి పథకానికి పిల్లల్ని తగ్గించడానికి టీడీపీ వాళ్లు టీడీపీ భవిష్యత్తుకు భరోసా పేరుతో ఇంటింటికీ కండోమ్స్ పంచుతున్నారంటూ వైసీపీ పార్టీ వాళ్లు ప్రచారం చేయగా.. అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
దీనికి కౌంటర్ గా టీడీపీ శ్రేణులు అధికార వైసీపీ సిద్ధం! పేరుతో కండోమ్ పాకెట్లు పంచుతోందంటూ.. వైఎస్ఆర్సీపీ సిద్ధం.. సిద్ధం అని కేకలు పెట్టేది ఇందుకా? అని, ఇలాంటి నీచపు ప్రచారాలు చేసే బదులు శవాల మీద చిల్లర ఏరుకోవచ్చు కదా అని టీడీపీ వాళ్లు కోటేషన్లు పెడుతున్నారు. ఇలా ప్రధాన పార్టీలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా తెగ ప్రచారాలు చేసుకుంటున్నారు.