బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు తెలంగాణా ప్రజలను మోసం చేస్తున్నాయి
టీపీసీసీ ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ ఎంబడి రాజేశ్వర్
నిర్మల్, (ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి ) ఏప్రిల్ 15 : త్వరలోనే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమని తెలంగాణా రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జాయింట్ కన్వీనర్ ఎంబడి రాజేశ్వర్ అన్నారు. సోమవారం నిర్మల్ మండలంలోని అనంతపెట్ లో ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ కు మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఉపాధి హామీ పథకంలో కూలీలుగా పనిచేస్తున్న వారి వద్దకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణాను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణా రాష్ట్ర ప్రజలకు ఇచిన హామీల్లో భాగంగా 100 రోజుల్లోనే 6 గ్యారెంటీ లను తెలంగాణా రాష్ట్ర ప్రజలకు అందించిన ఘనత తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేనని పేర్కొన్నారు.
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నసమయంలోనే నిరుపేద కుటుంబాల కోసం దేశ వ్యాప్తంగా ఉపాధిహామీ పథకం ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు తెలంగాణా ప్రజలను మొసం చేస్తున్నాయన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు స్వర్ణ ప్రాజెక్టు మాజీ చైర్మన్ ఒలత్రి నారాయణరెడ్డి, నిర్మల్ జిల్లా కాంగ్రెస్ ఎస్టీ సెల్, జిల్లా అధ్యక్షులు బనవత్ గోవింద్,సేవాదళ్ జిల్లా అధ్యక్షులు కే. రాజేశ్వర్, కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు సూర్యకాంత్ కాంబ్లీ, కాంగ్రెస్ నాయకులు తలారి రాజేశ్వర్ , జి.గంగాధర్ గ్రామస్తులు కోట చిన్న, లింగన్న, కోట శంకర్, బొడిగే, శివన్న, అడిగా శ్రీహరి గ్రామస్తులు పాల్గొన్నారు.