నిర్మల్ (ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి) ఏప్రిల్ 17 : శ్రీరామనవమిని పురస్కరించుకొని బుధవారం నిర్మల్ జిల్లాలోని నర్సాపూర్ నిర్మల్ పట్టణంలోని శాంతినగర్ బ్రాహ్మణపురి వాల్మీకి నగర్ వాగులు వాడాలలో గల శ్రీరాముల వారి ఆలయాలలో నిర్మల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాల వద్ద సాంప్రదాయ పద్ధతులలో వేద పండితులు మంత్రోచ్ఛారణలు చేస్తుండగా వారితో కలిసి ప్రవచనాలు చేశారు. అర్చకులచే తీర్థ ప్రసాదాలను స్వీకరించిన కూచాడి శ్రీహరి రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శ్రీరాముని బోధనలను ప్రతి హిందూ అనుక్షణం పాటించినప్పుడే శాంతి సామరస్యాల మధ్య దేశం అన్ని రంగాలలో సంక్షేమ బాటపడుతూ ముందుకు దూసుకెళ్తుందని చెప్పారు.
అలనాటి రాచరిక పాలనలో పరిస్థితులను అనుగుణంగా తాను నడుచుకునేందుకు శ్రీరాముని చేసిన ప్రయత్నాలు త్యాగాలు మహోన్నతమైనవని ఈ ప్రజాస్వామ్య దేశంలో కూడా ఆ విషయాలను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆయన వెంట నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గం ఈశ్వర్, మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి నర్సాపూర్ (జి )మండల కాంగ్రెస్ అధ్యక్షులు గడ్డం ఇంద్రకరణ్ రెడ్డి లతోపాటు పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్ ఆయా విభాగాల పదాధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.