Trending Now

మరో మారు ఆ పార్టీకి ఓటేస్తే యువత నిర్వీర్యం : ఎమ్మెల్యీ జీవన్​రెడ్డి

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: దేశంలోని యువతను బీజేపీ మోసం చేసిందని, ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకోకుండా యువతను నిర్వీర్యం చేసిందని కాంగ్రెస్​ నేత, ఎమ్మెల్యీ జీవన్​రెడ్డి ఆరోపించారు. బుధవారం గాంధీభవన్​లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఆసరా కాకుండా, బడా పారిశ్రామిక వేత్తలకు ఆసరగా నిలిచిందని మండిపడ్డారు. బీజేపీ పాలనలో ప్రజలపై పన్నుల భారం మోపిందని ధ్వజమెత్తారు. 2014లో చేసిన వాగ్దానాలు ఏమిటో మోదీ గుర్తు చేసుకోవాలని ప్రశ్నించారు. ఏటా 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువతను మోసం చేశారని విమర్శించారు.

చందాల వివరాలు ప్రజలకు తెలియాలి..

ఎలక్టోరల్‌ బాండ్లపై వాస్తవాలు కప్పిపుచ్చుతున్నారని ఏ పార్టీకి ఎవరు చందాలు ఇస్తున్నారనేది ప్రజలకు తెలియాలని జీవన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం దేశంలో అమిత్‌ షా చెప్పినట్లు వ్యవస్థలు నడుస్తున్నాయని విమర్శించారు. అమిత్ షా కూడా కిషన్‌రెడ్డిలా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లనే రద్దు చేస్తారని తెలిపారు. ఈడబ్ల్యూఎస్‌లో లబ్ధి పొందేది ఎవరో అందరికీ తెలుసున్నారు.

పంటలు ఎండటానికి కేసీఆర్ కారణం

ఎస్సారెస్పీలో నీటి కొరతకు కేసీఆర్​దే నైతిక భాధ్యతని వర్షా కాలంలో మేడిగడ్డ నీరును ఎస్సారెస్పీకి తరలించలేదని జీవన్​రెడ్డి తెలిపారు. ఈశాన్య రుతుపవనాలు ఆశించిన స్థాయిలో లేక వర్షం కురవలేదన్నారు. మిషన్ భగీరథ టెక్నికల్ ఆఫీసర్​పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 20 కిలో మీటర్ల నీటి ప్రవాహం తర్వాత వాటర్ ప్యూరిఫైర్ ప్రభావం ఏమీలేదని పవర్ ప్లాంట్​పై జ్యూడిషియల్ దర్యాప్తు వేయడంతో కేసీఆర్​కు భయం మొదలైందని వ్యాఖ్యానించారు. మేడిగడ్డ లేకుంటే కాళేశ్వరం లేదని మేడిగడ్డ కుంగిన తర్వాత నీటి పంపింగ్ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ప్రజలకు మంచి చేయాలనే కమిట్మెంట్ ఒక వైఎస్సార్ కే ఉండేదని ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ పరిస్థితులు వచ్చాయని తెలిపారు. రేవంత్ రెడ్డి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో దూసుకుపోతున్నారని కొనియా డా రు. ఆయన పాలన ప్రజలను మెప్పించేట్లు ఉందని కితాబిచ్చారు. జాతీయ స్థాయిలో బీజేపీ తుడిచిపెట్టుకుపొతుందని జోస్యం చెప్పారు. 2014ఎన్నికల మేనిఫెస్టో గురించి అమిత్ షా ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.

Spread the love

Related News

Latest News