మందకృష్ణ మాదిగపై కాంగ్రెస్ నేత పుష్పలీల ఫైర్..
ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: మందకృష్ణ అవకాశవాద రాజకీయాలు మానుకోవాలని.. నువ్వు చేసేది కరెక్ట్ అని జాతి బిడ్డలపై ప్రమాణం చేసి చెప్పగలవా..? అని మాజీ మంత్రి పుష్పలీల ఫైరయ్యారు. గాంధీ భవన్‌లో ఆమే మీడియా సమావేశంలో మాట్లాడారు. మాదిగలకు మందకృష్ణ ఏం చేశాడో చెప్పాలని.. మందకృష్ణ వెనక మాదిగలు లేరన్నారు. మందకృష్ణ ఉద్యమంలో ఉంటే మేం నెత్తిమీద పెట్టుకునే వాళ్ళమన్నారు. మాకు సోషల్ స్టేటస్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్.. అని కేసీఆర్ ని ఫామ్ హౌజ్ పంపిస్తాం అన్నాం, పంపించాం.. మా నెక్స్ట్ టార్గెట్ బీజేపీ.. బీజేపీ ని ఇంటికి పంపుతామని తెలిపారు. బీజేపీ వాళ్ళు ప్రచారానికి వస్తే తరిమి.. తరిమి కొట్టండని పిలుపునిచ్చారు. బీజేపీలో ఎస్సీ సెల్ నాయకులు చనిపోతే కూడా బీజేపీ నాయకులు వెళ్ళరని.. బీజేపీ ఎస్సీ సెల్ కి, కాంగ్రెస్ ఎస్సీ సెల్ కి చాలా తేడా ఉందన్నారు.