Trending Now

ఆయనను భారీ మేజారిటీతో గెలిపించుకుందాం..

ప్రతిపక్షం, దుబ్బాక, మార్చి 28: కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంటు అభ్యర్థి నీలం మధు ను భారీ మెజారిటీతో గెలిపించుకుందామని కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు. గురువారం బడుగు బలహీన వర్గాల అభ్యర్థి నీలం మధుకు కాంగ్రెసు పార్టీ మెదక్ ఎంపీ గా టికెట్ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ.. బస్టాండ్ సెంటర్ లో టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి బీసీ ముద్దుబిడ్డ నీలం మధును మెదక్ ఎంపీ గా భారీ మేజారిటీ తో గెలిపించకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధ్యక్షుడు ఏసు రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కొంగరి రవి, జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News