Trending Now

బండి సంజయ్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు..

ప్రతిపక్షం, హుస్నాబాద్ : హుస్నాబాద్ నియోజకవర్గం చిగురుమామిడిలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్ర కార్యక్రమంలో భాగంగా బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాతృమూర్తిపై అనుచిత వాక్యాలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బండి సంజయ్ పై కేసు నమోదు చేయాలని.. సోమవారం రాత్రి హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు స్థానిక హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. బండి సంజయ్ వ్యాఖ్యల చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు.

కన్న తల్లుల పట్ల మనిషి అనే వాడు మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ.. బండి సంజయ్ రాజకీయ లబ్ధి పొందాలని చూడటం తన అవివేకానికి నిదర్శనమని ఇలాంటి మాటలు సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన భారతదేశం ఏ మాత్రం సహించబోదన్నారు. దీనిని ముక్తకంఠంతో ప్రజలంతా ఖండించాల్సిన సమయమన్నారు. ప్రజాస్వామ్యంలో వ్యక్తిగతమైన విమర్శలు చేసే ముందు ఆలోచించి విమర్శలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి మెంబర్ తీయడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ, హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బంక చందు, కాంగ్రెస్ నాయకులు చిత్తారి రవీందర్, వడ్డేపల్లి వెంకటరమణ, పెరుమాండ్ల నర్సాగౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News