Trending Now

కాంగ్రెస్ మేనిఫెస్టో మహా అద్భుతం..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 3 : పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని కాంగ్రెస్ అధిష్టానం ప్రవేశపెట్టిన ఎన్నికల మేనిఫెస్టో మహా అద్భుతంగా ఉందని ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల కో కన్వీనర్ మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఏ లతీఫ్ పేర్కొన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని రాజుర, నగర్, పంచగుడి, లోకేశ్వరం, గడ్ చాంద తదితర గ్రామాలలో తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాలకు సమన్యాయం సమ సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందని చెప్పారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు ఏడాదికి లక్ష రూపాయలు సహాయం, విద్య బంధువులైన నిరుద్యోగ యువకులకు నెలకు రూ.8500 ఉపకార వేతనంతో ఏడాదిపాటు అప్రింట్ షిప్ అందజేస్తుందని చెప్పారు.

ఉపాధి హామీ పథకం కార్మికులకు కనీస వేతనం రోజుకి నాలుగు వందలు, సామాజిక, ఆర్థిక అంశాలతో కూడిన కులగణన, పంట నష్టపోయిన రైతులకు 30 రోజులలో పరిహార అందించేందుకు చర్యలు తదితర అంశాలు ఉన్నాయని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే జిల్లాలోని సిర్పూర్ కాంగజ్ నగర్, ఆసిఫాబాద్, ఖానాపూర్, ఆదిలాబాద్, నిర్మల్, ముధోల్, బోథ్ బోత్ నియోజకవర్గాలలో తిరుగుతూ.. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపు కోసం అన్ని వర్గాలను కలుస్తూ ప్రచారం చేయడం జరిగిందనన్నారు. అన్ని వర్గాల నుంచి విశేషాలు ఉందని చెప్పారు. అయినా తో పాటు పలువురు ఆయా విభాగాల పదాధికారులు నాయకులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News