కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి
ప్రతిపక్షం, వెబ్ డెస్క్: కరువుకు కారణం కాంగ్రెస్ కాదు.. బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్ట్ లే కారణమని కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఎండాకాలం కరువుపై బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై రోజు రోజుకు దిగజారి ఆరోపణలు చేస్తున్నారన్నారు. కాళేశ్వరం కట్టి కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తా అన్నారు, బీఆర్ఎస్ కక్కుర్తికి కూలి పోయిందని ఆరోపణలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం 20ఏండ్లు వెనక్కి తెలంగాణను అప్పులకు నెట్టిందని, బీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో కనుమరుగు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని.. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని ఆయన తెలపారు.