బీజేపీపై కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి ఫైర్
ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: బీజేపీ మాయమాటలను, మోసాలను ప్రజలు నమ్మరని.. బీజేపీ హయాంలో యువత మాదకద్రవ్యాలకు, జూదాలకు అలవాటు పడ్డారని కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు. గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పది ఏండ్ల బీజేపీ పాలనలో దేశంలో పేదలు ఇబ్బంది పడుతున్నారని అన్ని సర్వేలు చెబుతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పేదలకు రేషన్ కార్డులు ఇచ్చిందని.. బీజేపీ ఇప్పటి వరకు ఒక్క రేషన్ కార్డు పెంచలేదు.. అలాగే వృద్ధులకు, వితంతవులకు ఒక్క పైసా కూడా పెన్షన్ పెంచలేదని ఆయన ఎద్దేవా చేశారు. ధరలను నియంత్రిస్తాం, అవినీతిని నిర్ములిస్తాం అన్నారు కానీ నల్లధనాన్నివాళ్లే దోచుకున్నారని సంచలన కామెంట్స్ చేశారు.
ఏడాదికి కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు.. బీజేపీకి ఇంకా మేనిఫెస్టో నే లేదన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోని విమర్శిస్తున్నారు.. కాంగ్రెస్ మేనిఫెస్టోకు ప్రజల్లో విశేష స్పందన లభిస్తోందన్నారు. విభజన చట్టంలో పొందు పరిచిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గుజరాత్ తీసుకెళ్లి పోతే, బీజేపీ నాయకులు ఒక్కరు మాట్లాడలేదని గుర్తు చేశారు. ఎయిమ్స్ లో750 పడకలు ఉండాలి, కానీ 135 మాత్రమే ఉన్నవి, బీజేపీ తెలంగాణకు ఏమి చేశారని ప్రజలు ఓట్లు వెయ్యాలి.. అని ఆయన ప్రశ్నించారు. మోడీ మూడు నల్ల చట్టాలు తెచ్చి 750 మంది రైతులకు చావుకు కారణమైండు, 180 ప్రభుత్వ రంగ సంస్థలను కాంగ్రెస్ కట్టింది, మోడీ సొంత రాష్ట్రంలో బీజేపీ నాయకుల ప్రచారాన్ని ప్రజలు అడ్డుకుంటున్నారు, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఏమి చేసిందని నిలదీయండి పిలుపునిచ్చారు.