కాంగ్రెస్ పార్లమెంటరీ ఎన్నికల కో కన్వీనర్ ఎం.ఏ. లతీఫ్
నిర్మల్ ( ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి) ఏప్రిల్ 18 : అదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపే లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తున్నామని అదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ కో కన్వీనర్ ఎంఏ లతీఫ్ పేర్కొన్నారు. తమకు టీసీసీ నుంచి అందిన ఆదేశాల ప్రకారం ఖానాపూర్ సిర్పూర్ కాగజ్ నగర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాలలో ప్రచార బాధ్యతలను అప్పగించారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కార్యక్రమాలను ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే చేకూర్చే లాభాలు, ప్రయోజనాలను ప్రజలకు కరపత్రాల ఆధారంగా అవగాహన కల్పించి తలుపు తలుపును తడుతూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు.
దేశ భవిష్యత్తు ప్రధాని రాహుల్ గాంధీని ప్రజలలో కూడా పూర్తిస్థాయి విశ్వాసం వచ్చేసిందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. పదేళ్ల బీజేపీ ప్రభుత్వ పాలనపై ప్రజలు విసిగి ఎత్తిపోయారని వారికి చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన తెలిపారు. ఖానాపూర్ నియోజకవర్గం లో ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు పటేల్ ప్రజలకు అనుక్షణం అందుబాటులో ఉండి.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు అరుహులైన వారికి అందేలా చూసుకోవడంలో ముందున్నారని ఆయన చెప్పారు. ఖానాపూర్, ఉట్నూర్ ప్రాంతాలలో తాను పర్యటించగా అన్ని వర్గాల నుంచి కాంగ్రెస్ పట్ల విశ్వాసనీయత ఉన్నట్లు గుర్తించడం జరిగిందని తెలిపారు. ఆయన వెంట ఖానాపూర్ పార్లమెంటరీ కో కన్వీనర్ షబ్బీర్ భాష నాయకులు జహీరుద్దీన్, నాయీమ్ సలీం ఖాన్ ,మొయినుద్దీన్, రహీమ్ లతోపాటు పలువురు ఉన్నారు.