సారంగాపూర్ మండలంలో హోరాహోరీగా సాగిన ప్రచారం..
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 8 : కాంగ్రెస్ పార్టీ అదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపే లక్ష్యంగా నిర్మల్ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి మల్లారెడ్డి సుమారు నెలరోజులుగా రోజువారి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ దూసుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే బుధవారం కూడా నిర్మల్ జిల్లా కేంద్రం తో పాటు సారంగాపూర్ మండలం కౌట్ల (బి ) సువర్ణ లింగాపూర్ గ్రామాలలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తున్న తరుణంలో పార్టీలు ప్రచార సరళి వైవిధ్య బరితంగా కొనసాగుతున్న ప్రచార పోరులో బార్ అసోసియేషన్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అల్లూరి మల్లారెడ్డి తమ బృందంతో దుమ్ము రేపుతు ఏ సమస్యకైనా లెక్కచేయకుండా ముందుకు సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రచారం. ఈ ప్రచారంలో భాగంగా ఉపాధి హామీ కార్మికులతో ఆప్యాయంగా పలకరించి కాంగ్రెస్ పార్టీ అందించిన సేవలు గురించి వివరించారు. జరగబోయే పోలింగ్ ఈ నెల13 న చేతు గుర్తు కు ఓటు వేయాలని అన్నారు.
అదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి అత్రం సుగుణ తమ అందరి ఆడబిడ్డను ఆదరించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల అనంతరం తెలంగాణ రాష్ట్ర మొత్తం ఎదురుచూస్తున్న పేదవారికి ఇందిరమ్మ ఇల్లు తో సహా ప్రతి పేదవారి కలలను సహకరించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారన్నారు. ఉపాధి హామీ కార్మికులందరికీ ఆప్యాయంగా పలకరించి మండే ఎండల్లో పనులు నిర్వహిస్తున్న కూలీలకు దాహం తీర్చేలనే కోరికతో మజ్జిగను పంపిణీ చేశారు. ఈ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు బాణావత్ గోవింద నాయక్ కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ ఉప అధ్యక్షుడు కాంబ్లే సూర్యకాంత్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పోతారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ సారంగాపూర్ మండల అధ్యక్షుడు భీంరావు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోతారెడ్డి, సీపీఐ నాయకుడు ఎస్ ఎన్ రెడ్డి, పౌర హక్కుల సంఘం నాయకులు బోరన్న, శశికళ, కొండల ,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.