Trending Now

రైతులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది.. మాజీ మంత్రి

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: వందరోజుల్లో హామీలన్నింటినీ నెరవేరుస్తామని ప్రగల్భాలు పలికి ముఖంచాటేసిన సీఎం రేవంత్ రెడ్డికి ఓటు అడిగే నైతిక హక్కు లేదని మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం రుద్రారం గ్రామంలో గణేష్ గడ్డ దేవాలయంలో పూజా కార్యక్రమంలో పాల్గోన్న ఆయన బీఆర్ఎస్ పార్టీ లోక్ సభ ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులను కాంగ్రెస్ పార్టీ 5 హామీల పేరుతో మోసం చేసిందన్నారు. 2004 నుంచి ఇప్పటి వరకు గులాబీ జెండా మెదక్ పార్లమెంట్ లో ఎగురుతుందని గుర్తుచేశారు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు లో గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంత ఎత్తుకు లేసిందో.. అంతగా తుస్సుమనిపించిందన్నారు. వందరోజుల్లో హమీలు నెరవేరుస్తామని చెప్పినా ఇప్పటికీ ఎలాంటి హమీలు నెరవేరలేదని విమర్శలు సంధించారు. ఇప్పటికే పేద మహిళలకు ఫించన్లు ఇస్తామన్న రేవంత్ రెడ్డి 42లక్షల మందికి బాకీ పడ్డారన్నారు. నిరుద్యోగ భృతి, పేద మహిళలకు ఫించన్లు ఇచ్చిన తరువాతే ఓట్లు ఆడగాలన్నారు. కౌలు రైతులకు, రైతులకు రుణమాఫీలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని దుయ్యబట్టారు.

అభయహస్తం అక్కరకు రాని హస్తమయ్యిందని, కేసీఆర్ కిట్టు బందయ్యింది. తిట్లు మాత్రం మొదలైనయ్యాయన్నారు. రైతులను కేసీఆర్ పరామర్శిస్తే తట్టుకోలేక.. రేవంత్ రెడ్డి నోటి కొచ్చినట్టు మాట్లాడుతున్నారని, రేవంత్ రెడ్డి భాష జుగుప్సా కరంగా ఉందన్నారు. రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రా.. చెడ్డీ గ్యాంగా అంటూ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మార్పు కావాలని అధికారంలోకి వచ్చి ప్రజలను మాయ చేస్తున్నదన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి లోకల్ కాదంటూ దుష్ర్పచారం చేస్తున్నారని.. ఆయన తెల్లాపూర్ లోనే ఉంటున్నారని తెలిపారు. వంద కోట్ల నిధిని ఏర్పాటు చేసి పేదల అభ్యున్నతికి కృషి చేస్తానన్న మంచి మనిషి వెంకట్రామిరెడ్డిని అన్నారు. అభ్యర్థి గుణగణాలు చూసి ప్రజలు ఓటేయాలని, పార్లమెంట్ లో మన సమస్యలపై గళం విప్పే వాళ్లు కావాలా.. గులాం గిరి చేసే వారు కావాలా ప్రజలు నిర్ణించుకోవాలని ఆయన అన్నారు.

Spread the love

Related News

Latest News