శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ
ప్రతిపక్షం, రామగిరి(మంథని), ఏప్రిల్ 17 : ప్రజలంత సుభిక్షంగా, సుఖసంతోషాలతో ఉండలని కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. బుధవారం సెంటనరీ కాలనీ శ్రీ కోదండ రామాలయంలో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సింగరేణి కార్మికులు, ప్రజలంతా సుఖ, సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో, వర్షాలు సకాలంలో కురిసి రాష్ట్రంలోని రైతులకు లాభం చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను అని తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ జెడ్పీటీసీ గంట వెంకట రమణ రెడ్డి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ వనం రామచంద్ర రావు, కొరకోప్పుల తులసీరాం, కాటం సత్యం, బండారి సదానందం, మేకల మారుతి, విజయ్, మోహన్, హరీష్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.