నిర్మల్ మండలంలో ఇంటింట ఎన్నికల ప్రచారం..
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 29 : ఉత్కంఠ భరితంగా జరుగుతున్నఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపు ఇప్పటికే ఖాయమైందని మండల పరిషత్ అధ్యక్షులు కోరిపల్లి రామేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నిర్మల్ మండలంలోని నీలాయిపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 10 సంవత్సరాల ఎన్డీఏ పాలనలో మోసపూరితమైన మాటలే తప్ప దేశానికి మోడీ చేసింది ఏమీ లేదని పేర్కొన్నారు. అనేక ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేసి కార్పొరేటీకరణ వ్యవస్థను బలపరిచిన ఘనత ఒక మోడీకే దక్కుతుందని పేర్కొన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాంగానే ప్రతి మహిళకు ప్రతి ఏడాది లక్ష రూపాయలు నగదు రూపేన సాయం అందించడంతో పాటు వినూతమైన సంక్షేమ పథకాల ద్వారా అన్ని వర్గాలకు లాభాలు చేకూర్చేలా ప్రణాళిక రూపొందించుకున్నదని చెప్పారు. కాంగ్రెస్ వస్తేనే కుల పిచ్చి.. మత పిచ్చి.. పోయి సుస్థిరమైన పాలన అన్ని వర్గాలకు అందుతుందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో పత్రాలను గడపగడపకు వెళ్లి ఈ సందర్భంగా వివరించి, కాంగ్రెస్ చేతి గుర్తుకు ఓటు వేయాలని ఆయన ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించారు. ఇప్పటికే రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ ముందుకు దూసుకెళుతున్న ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేనన్న విషయాన్ని గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ విలాస్, సర్పంచులు సాయన్న, పద్మాకర్, నిర్మల్ మండల పార్టీ కన్వీనర్ కుంట వేణు, నాయకులు రవీందర్, నరేందర్, ధర్మరాజు, నవత్ భూమన్న కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.