ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్.. ఈరోజు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వేదికగా సమరశంఖం పూరించనుంది. సాయంత్రం 4.30గంటలకు ‘జన జాతర’ పేరుతో భారీ బహిరంగసభ నిర్వహించనుంది. నిన్న ఢిల్లీలో ప్రకటించిన మేనిఫెస్టోను రాహుల్ గాంధీ, CM రేవంత్ తెలుగులో విడుదల చేస్తారు. సభకు 10లక్షల మంది వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేశారు. రేవంత్‌రెడ్డి ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.