కరీంనగర్ పెద్దాసుపత్రి తరలింపునకు కుట్రలు?

హుజురాబాద్ కు మార్చేందుకు ప్రయత్నాలు
రోజురోజుకు పెరుగుతున్న రాజకీయ నేతల ఒత్తిడి
ప్రధాన ఆసుపత్రిని తరలించ వద్దని ప్రతిపక్షాలు

ప్రతిపక్షం బ్యూరో, కరీంనగర్, నవంబర్ 3: కరీంనగర్ ప్రభుత్వ ప్రధానాసుపత్రి తరలింపునకు కుట్రలు..జరుగుతున్నాయి. వందల యేండ్ల చరిత్ర ఉండి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న ఈ ఆసుపత్రి ని హుజురాబాద్ కు తరలించేందుకు ప్రయత్నాలు జరుతున్నాయి. రోజురోజుకూ రాజకీయ నేతల ఒత్తిడి పెరుగుతోంది. ప్రతిపక్షాలు ఈ తరలింపును వ్యతిరేకిస్తున్నాయి. కరీంనగర్ కు ప్రస్తుతం మెడికల్ కళాశాల కేటాయించినందున, అక్కడి ఆసుపత్రిని హుజురాబాద్ కు తరలించడానికి చర్యలు తీసుకుంటున్నారని సమాచారం. కాగా, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి భవనాన్ని మెడికల్ కళాశాలకు కేటాయించినందున, ఆసుపత్రిని హుజురాబాద్ కు తరలించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణా రెడ్డి డిమాండ్ చేశారు. హుజురాబాద్ తో పాటు చుట్టుపక్కల ప్రజలందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ముఖ్యంగా హుజురాబాద్ మీదుగా వెళుతున్న నేషనల్ హైవే ప్రయాణికులకు కూడా అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇక్కడి ప్రాంతంలోని పేద మధ్యతరగతి ప్రజల ను దృష్టిలో ఉంచుకొని మెరుగైన వైద్య సేవలు అందించడానికి , రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి నీ హుజురాబాద్ కు తరలించే విషయంలో కూడా ఆలోచన చేసి , ఆ దిశగా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.హుజురాబాద్ అస్పత్రి అభివృద్ధి కి కేంద్ర మంత్రి బండి సంజయ్ కృషి చేశారని ఆయన అన్నారు.ఇప్పటి కే హుజురాబాద్ అస్పత్రిని పరిశీ లించామని పేర్కొన్నారు. .రూ.1 కోటి 50 లక్షల సి ఎస్ ఆర్ నిధులతో 15 రకాల విలువైన వైద్య పరికరాలు సామాగ్రిని ఇటీవల కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అందించారని తెలిపారు.

Spread the love

Related News