కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ కౌన్సిలర్
ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బుదవారం షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో గల 5వ వార్డు కౌన్సిలర్ కృష్ణవేణి దిలీప్ చంద్ర కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి షాద్ నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బాబర్ అలీ ఖాన్, రఘునాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజ్ గౌడ్, తిరుపతిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాజు, తదితరులు పాల్గొన్నారు.