ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: నీట్‌లో అక్రమాలు జరిగాయనే ప్రచారం నేపథ్యంలో దేశానికి దాని అవసరం లేదని టీవీకే పార్టీ చీఫ్, నటుడు విజయ్ అన్నారు. ‘ప్రజలు నీట్‌పై నమ్మకాన్ని కోల్పోయారు. తమిళనాడు ప్రభుత్వం నీట్ పరీక్షను వ్యతిరేకిస్తూ పాస్ చేసిన తీర్మానాన్ని స్వాగతిస్తున్నా. రాష్ట్ర ప్రజల ఎమోషన్లతో ఆడుకోవద్దని కేంద్రానికి నా విజ్ఞప్తి. విద్యను ఉమ్మడి(కేంద్రం, రాష్ట్రం) జాబితా నుంచి రాష్ట్ర జాబితాలో చేర్చాలి’ అని పార్టీ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.