ప్రతిపక్షం, వెబ్ డెస్క్: కేసీఆర్ కుటుంబం పదేళ్లలో రాష్ట్రాన్ని దోచుకుందని BJP రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాలలో ఏర్పాటు చేసిన BJP విజయసంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ.. అన్ని పథకాల్లో కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. దేశానికి మోదీ నాయకత్వం అవసరమని వ్యాఖ్యానించారు. దేశం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం నరేంద్రమోదీ గారిని ఆశీర్వదించండి. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో 17కు 17సీట్లు గెలిపించాలని కోరారు.