ప్రతిపక్షం, వెబ్ డెస్క్: లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగాలని సీపీఎం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమైంది. భువనగిరి ఎంపీ అభ్యర్థిగా జహంగీర్ పేరును ప్రకటించింది. త్వరలోనే మిగిలిన 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం.