ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: క్రికెటర్ హార్దిక్ పాండ్య సోదరుడు(సవతి తల్లి కొడుకు) వైభవ్ పాండ్య అరెస్ట్ అయ్యారు. వైభవ్, తన సోదరుడు, క్రికెటర్ కృనాల్ పాండ్య కలిసి 2021లో ఓ బిజినెస్ పెట్టారు. అందులో వైభవ్‌కు 20% వాటా ఉంది. కాగా.. అతడు భాగస్వాములకు తెలియకుండా సొంతంగా ఇదే తరహా వ్యాపారం మొదలుపెట్టారు. కొత్త బిజినెస్ కోసం పాత వ్యాపారం నుంచి రూ.4.3కోట్ల నిధులను మళ్లించారట. దీంతో అతడిపై చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదయ్యాయి.