ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 30: నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో ఉన్న ప్రసిద్ధ సరస్వతి అమ్మవారి దేవస్థానంలో గురువారం భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. తెల్లవారుజామున నుంచే వేలాదిగా తరలివచ్చిన భక్తులు అమ్మవారి ఆలయానికి చేరుకొని దర్శనం కోసం గంటల తరబడి క్యూలో ఉన్నారు. కుటుంబ సమేతంగా పిల్లా పాపలతో తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆలయ ఆవరణ అంతా భక్తులతో కిటకిటలాడింది. ముందుగా గోదావరి నదిలో పవిత్ర స్నానాలను ఆచరించిన భక్తులు అత్యంత సాంప్రదాయ పద్ధతులలో దుస్తులు వేసుకొని ఆలయానికి చేరుకున్నారు.
ఈ విద్యా సంవత్సరం నుండే పాఠశాలలలో ప్రవేశాలు తీసుకొనున్నా చిన్నపిల్లలను, పలకాలు, బలపాలతో తీసుకొని వచ్చి వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సాంప్రదాయ పద్ధతులలో అక్షరాభ్యాసాలను నిర్వహించారు ఈ సందర్భంగా నాన్న సరస్వతి దేవికి నైవేద్యాలను సమర్పించుకొని అర్చకుల ఆశీర్వచనాలను తీసుకోవడంతో పాటు తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున భక్తులకు ఎలాంటి ఆ సౌకర్యాలు కలగకుండా ఆలయ ఈవో కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వచ్ఛంద సంస్థల వారు భక్తుల రద్దీని గమనించి తమదైన రీతిలో సేవా కార్యక్రమాలను చేపట్టారు. స్థానిక పోలీసులు అమ్మవారి ఆలయం ఉన్న పరిసరాలలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లను చేసి అనుక్షణం పర్యవేక్షణ చేపట్టారు.