ప్రతిపక్షం, నేషనల్: గుజరాత్‌లోని పోర్‌బందర్ సమీపంలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్టు ఇండియన్ నేవీ బుధవారం తెలిపింది. నిఘా వర్గాల సమాచారం మేరకు సముద్రంలో రెండు రోజుల పాటు ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే అనుమానాస్పదంగా కనపడ్డ ఓ నౌకను మంగళశారం ఆపి తనిఖీ చేయగా.. 3300 కిలోల డ్రగ్స్ పట్టుబడ్డట్టు వెల్లడించింది. అందులో3089 కిలోల గంజాయి,158 కిలోల మెథాఫెంటమైన్, 25 కిలోల మార్ఫిన్ ఉన్నట్టు పేర్కొంది. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు రూ.2000 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.