ప్రతిపక్షం, ఏపీ: మెగా డిఎస్‌సి ప్రకటించాలంటూ … గురువారం ఛలో సెక్రటేరియట్‌కు కాంగ్రెస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో … ఆంధ్రరత్న భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిన్న రాత్రి నుండే ఎక్కడికక్కడ పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. గత రాత్రి నుంచి ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆంధ్రరత్న భవన్‌లోనే ఉండిపోయారు. ఈరోజు ఉదయం 10 గంటలకు ఆంధ్రరత్న భవన్ నుంచి షర్మిల ఛలో సెక్రటేరియట్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. అయితే పార్టీ కార్యాలయం నుంచి బయటకి వచ్చిన గిడుగు రుద్రరాజు, మస్తాన్ వలీలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.