Trending Now

సైబర్ నేరాల నియంత్రణకు సైబర్ వారియర్స్..

పోలీస్ కమిషనర్ బి. అనురాధ

ప్రతిపక్షం, సిద్దిపేట ప్రతినిధి ఏప్రిల్ 2: సైబర్ నేరాలను అరికట్టేందుకు సైబర్ వారియర్స్ ను ఏర్పాటు చేసినట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ తెలిపారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్, అదనపు డి.జి.పి. షికా గోయల్ ఆదేశానుసారం ప్రతి పోలీసు స్టేషన్ లలో సైబర్ వారియర్స్ కు ప్రత్యేక ఫోన్స్, సిమ్స్ ను సీపీ అందించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. పెరిగిపోతున్న టెక్నాలజీకి తగ్గట్టుగానే దేశవ్యాప్తంగా సైబర్‌ నేరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో జిల్లాలో సైబర్‌ క్రైమ్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు, తద్వారా సైబర్ నేరాల నియంత్రణకు పోలీస్‌ శాఖ సైబర్ నేరాల నియంత్రణ కోసం సైబర్ నేర బాధితులకు మెరిగైన సేవలు అందించాలని సూచించారు. సైబర్ కేసుల్లో పూర్తి స్థాయి ఆధారాలు సేకరించి నేరస్ధులను గుర్తించటం, నేరగాళ్లకు శిక్ష పడేలా చేయడం, బాధితులకు న్యాయం చేయడం అనేది సైబర్ వారియర్స్ చాలేంజ్ గా తీసుకొవాలన్నారు.

పోలీస్‌ శాఖలో నియమితులై పూర్తి స్థాయిలో టెక్నాలజీపై పట్టున్న సిబ్బందిని సైబర్‌ నేరాల నియంత్రణకు ఉపయోగించి ప్రజలకు త్వరితగతిన సేవలందించే లా ఈ సైబర్ వారియర్స్ ని తయారు చేసినామని తెలిపారు. జిల్లా పరిధిలో 26 మంది సిబ్బందిని సైబర్ క్రైమ్ నేరాలను పరిష్కరించేందుకు కేటాయించినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఎసిపి శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ శేఖర్, సైబర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది రాము, హరీష్, సైబర్ వారియర్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News