Trending Now

డీజిల్ స్మగ్లింగ్ ముఠా అరెస్టు..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: కర్ణాటక నుండి డీజిల్ స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను సైబరాబాద్ SOT పోలీసులు పట్టుకున్నారు. వీరి నుండి 10 లక్షల విలువ చేసే 10800 లీటర్ల డీజిల్, 35 లక్షల విలువ చేసే 7 చిన్న డీజిల్ ట్యాంకర్లను సైబరాబాద్ SOT పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. ఇవాళ SOT మాదాపూర్ టీం, గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా గచ్చిబౌలి PS పరిధిలోని వట్టినాగులపల్లి శ్రీదేవి ఇంజినీర్ కళాశాల ముందుగల ఓపెన్ ప్లాట్ ను అడ్డగా చేసుకుని కర్ణాటక నుండి అక్రమంగా తరలించిన 10 లక్షల విలువ చేసే 10800 లీటర్స్ డీజిల్ ను, 7 చిన్న ట్యాంకర్ లను 7 మంది డ్రైవర్ లను పట్టుకోవడం జరిగింది. విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాధాకృష్ణ అనే పేరున్న వ్యాపారస్తుడు డీజిల్ స్మగ్లర్ గా మారి.. కోట్ల రూపాయల డీజిల్ ను కర్ణాటక నుండి తెలంగాణకు స్మగ్లింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

రాధాకృష్ణ చేస్తున్న స్మగ్లింగ్ ద్వారా నెలకు కొన్ని కోట్లలో తెలంగాణా రాష్ట్ర ఖజానాకు గండి పడుతున్నట్లు తెలుస్తోంది. స్మగ్లర్ రాధాకృష్ణ హైదరాబాద్ లో ఉన్న డోర్ స్టెప్ డెలివరీ సర్వీస్ నడుపుతున్న మరో స్మగ్లర్ సూర్య @ సాయి రామ్ సూర్య కు సప్లయి చేస్తున్నాడు. డోర్ స్టెప్ డెలివరీ సర్వీస్ యజమాని సూర్య @ సాయి రామ్ సూర్య తన మేనేజర్ అయిన రితేష్ ద్వారా చిన్న చిన్న టాంకర్లకు మార్చి స్థానికంగా ఉన్న ఇసుక లారీలకు, క్వారీ లారీలకు డోర్ స్టెప్ డెలివరీ సర్వీస్ యాప్ ద్వారా సంప్రదించిన కన్జూమర్లకు అమ్ముతున్నట్లు తెలుస్తుంది. స్మగ్లర్ రాధాక్రిష్ణ సురేష్ ఒక్కరికే కాకుండా తెలంగాణలో ఇంకా చాలా మందికి సప్లైయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గత నెలలో కూడా ఇదే స్మగ్లర్ రాధాక్రిష్ణ ఇదే ప్లేస్ లో 18,000 లీటర్స్ డీజిల్ అఫిషియల్ ట్యాంకర్ ద్వారా సప్లయ్ చేస్తూ.. సైబరాబాద్ SOT చేతికి దొరికాడు. స్మగ్లర్ రాధాక్రిష్ణ పై ఇప్పటికే గచ్చిబౌలి పోలీసు స్టేషన్ లో నమోదైన కేసుల్లో పరారీ లో ఉన్నాడని.. రాధాక్రిష్ణపై చాలా కేసులు నమోదై ఉన్నయాని పోలీసులు తెలిపారు. దీంతో గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love

Related News

Latest News