ప్రతిపక్షం, వెబ్ డెస్క్: జగత్గిరిగుట్ట లోని స్థానిక లేబర్ అడ్డా వద్ద గంజాయి అమ్ముతున్న ఓ వ్యక్తిని సైబరాబాద్ SOT బాలానగర్ టీమ్ పట్టుకున్నారు. ఒడిస్సాకు చెందిన శ్రీకాంత్ లీమా గంజాయి అమ్మకానికి ప్రయత్నిస్తున్నాడనే సమాచారం మేరకు సైబరాబాద్ SOT బాలానగర్ టీమ్ అతడిని పట్టుకున్నారు. రూ. 50,000/- విలువ చేసే 2 కేజీ ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గత సంవత్సరంగా గంజాయి స్మగ్లింగ్ నే తన వృత్తిగా చేసుకుని గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.