Trending Now

జర్మంటెన్ హాస్పిటల్ ను ప్రారంభిన మంత్రి దామోదర్ రాజనర్సింహ ..

ప్రతిపక్షం, తెలంగాణ: హైదరాబాదులోని అత్తాపూర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన జర్మంటెన్ హాస్పిటల్ ను మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రి ద్వారా ప్రజలకు మరిన్ని వైద్య సేవలు అందాలని మంత్రి ఆకాంక్షించారు. హైదరాబాద్ ను మెడికల్ హబ్ గా తీర్చిదిద్దుతున్నామన్నారు. దేశ విదేశాల నుండి ఎంతోమంది మెరుగైన వైద్య, ఆరోగ్య సేవల కోసం రాష్ట్రానికి వస్తున్నారన్నారు. మెడికల్ టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు.

ఈ కార్యక్రమంలో జర్మంటెన్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ మీర్ జావేద్ జార్ ఖాన్, CEO జల్రం ఆనంద్ బాబు, ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ Dr. మీర్ ఖలీద్ అలీ, COO హమ్మర్ నౌశీన్, CBO మహమ్మద్ ఒమర్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మెట్టు సూర్యప్రకాష్, కపిల్ రాజ్, రాజ్ కుమార్, ఎన్ సత్యనారాయణ వెంకట్రామిరెడ్డి, ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News