Trending Now

నిద్రమత్తులో విద్యుత్ శాఖ అధికారులు..

మృత్యువాత పడుతున్న మూగజీవాలు

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 6 : వర్షాకాలం దృష్ట్యా ఆయా శాఖల అధికారులు సిబ్బంది అప్రమతమై ప్రణాళిక అబద్ధమైన రీతిలో జరిగే ప్రమాదాలు అనర్థాలు నష్టాలను దృష్టిలో పెట్టుకొని యుద్ద ప్రతిపాదికన చర్యలు తీసుకుంటూ దూసుకెళ్తుండగా విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది మాత్రం తమకేమీ పట్టనట్లు వివరిస్తుండడంతో నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆయా ప్రాంతాలలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు విద్యుత్ తీగలు స్తంభాలున్నా ప్రాంతాలలో ప్రమాదం ప్రాణాంతకంగా మారి మూగజీవాలు మృతువాత పడుతున్నాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలోని 42 వార్డులలో 33 వార్డులు మురికివాడాలుగా ఉండగా సదరు ప్రాంతాలలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు తీగలు ప్రమాదకరంగా ఉన్నాయి. అనేక ప్రాంతాలలో విద్యుత్ తీగలు క్రిందికి వేలాడుతూ ఉండగా ట్రాన్స్ఫార్మర్లు కంచెలు ఉండి కొని కంచెలు లేక కొని ప్రమాదకరంగా ఉన్నాయి. ట్రాన్స్ ఫార్మర్లను ను ఏర్పాటు చేసిన తర్వాత ఇనుప కంచెళ్లను ఏర్పాటు చేసిన విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది ఆ తర్వాత దాని నిర్వహణను మరిచిపోవడంతో అందులో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి అటు మొక్కలకు ఉన్న ఆకులను తినేందుకు వెళ్లిన మూగజీవాలు సరఫరా ఆయి మృత్యువాత పడుతున్నాయి.

నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాజులపేట, మౌలానా ఆజాద్ నగర్, అస్రా కాలనీ, వైయస్సార్ కాలనీ, రాంనగర్, శాంతినగర్, బైల్ బజార్ తదితర కాలనీలలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కంచెలు ఉన్న వాటిలో ఎక్కువగా పెరిగిన పిచ్చి మొక్కల కారణంగా అర్థంగ్ వచ్చి మూగ జీవాలు మృతి చెందుతున్నాయి. ఇలాంటి సంఘటనలు పట్టణంలో ఎన్ని జరిగిన విద్యుత్ శాఖ అధికారులు సిబ్బందులలో ఎలాంటి చలనం లేకపోవడం పట్ల పట్టణవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేలాది రూపాయల విలువ చేసే దూడలు, బర్లు మేకలు విద్యుత్ షాక్ కు గురై మృతి చెందుతూ ఉండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు జరుగుతున్న సంఘటనాలను దృష్టిలో పెట్టుకొని పట్టణంలోని 43 వార్డులలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు, తీగలను సరిచేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

Spread the love

Related News

Latest News