Trending Now

మెపా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా దాసరి శాంత కుమారి ముదిరాజ్ నియామకం..

ప్రతిపక్షం, సిద్దిపేట, మార్చి 22: ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్రం ( ఎంఈపిఏ) మెపా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్న సిద్దిపేట జిల్లాకి చెందిన దాసరి శాంత కుమారి ముదిరాజ్ ను మెపా యూనియన్ కి రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు నియామక పత్రాన్ని రాష్ట్ర అద్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి బోట్ల పల్లి సంజీవన్ కుమార్, గౌరవ అధ్యక్షులు డాక్టర్ జగన్ మోహన్ ముదిరాజ్ ఆమెకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాకు రాష్ట్ర కమిటీ లో స్థానం రావడానికి కృషి చేసిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. జాతి అభివృద్ది ఐక్యత కోసం అందరినీ కలుపుకుని ముఖ్యంగా మహిళ సాధికారత కోసం ముందుకు వెళతానని అన్నారు. అలాగే ముదిరాజ్ ల రిజర్వేషన్ సాధన కోసం కలిసి కట్టుగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు కృషి చేస్తానని.. అందుకోసం ఐక్య ఉద్యమాలు చేస్తాను అని అన్నారు.

Spread the love

Related News

Latest News