Trending Now

IPL 2024 : నేడు ఢిల్లీ క్యాపిటల్‌తో లక్నో ‘ఢీ’

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌లో భాగంగా నేడు ఢిల్లీలో ఢిల్లీ క్యాపిటల్ తో లక్నో తలపడనుంది. రెండు జట్లూ 12 పాయింట్ల మీద ఉన్నాయి. ఢిల్లీకి ఇదే ఆఖరి లీగ్ మ్యాచ్ కాగా.. లక్నోకు ముంబైతో మరో మ్యాచ్ మిగిలుంది. అయితే SRHతో ఓటమి తర్వాత లక్నో రన్ రేట్ ఘోరంగా పడిపోయింది. దీంతో ప్లేఆఫ్స్ బెర్త్ అనుమానమే. ఇక ఢిల్లీ ఈరోజు గెలిస్తేనే ప్లేఆఫ్స్‌కు ఎంతో కొంత ఛాన్స్ ఉంటుంది. ఓడితే ఢిల్లీ కూడా ఇంటికే.

టాప్ ప్లేస్‌కి కేకేఆర్.. గుజరాత్ ఔట్

కేకేఆర్, గుజరాత్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌కి వర్షం అడ్డుతగిలింది. మ్యాచ్ జరగాల్సిన అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియంలో వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది. దీంతో ఇరుజట్లకూ చెరో పాయింట్ లభించింది. దీంతో కేకేఆర్ టేబుల్ టాప్‌‌ప్లేస్‌కు చేరగా.. గుజరాత్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రస్తుతం గుజరాత్ కి 11పాయింట్లున్నాయి. తర్వాతి మ్యాచ్ SRHతో గెలిచినా 13 పాయింట్లే అవుతాయి. దీంతో గుజరాత్ అధికారికంగా లీగ్ నుంచి ఎలిమినేట్ అయిన 3వ జట్టుగా నిలిచింది.

Spread the love

Related News

Latest News