ఢిల్లీతో ముంబై, లక్నోతో రాజస్థాన్ ‘ఢీ’
ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: IPL 2024లో నేడు రెండు మ్యాచులు జరగనున్నాయి. మ.3:30కి ఢిల్లీ వేదికగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. రాత్రి 7:30కి లక్నో వేదికగా LSG, RR మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు DC, MI మధ్య జరిగిన మ్యాచుల్లో MI 19, DC 15 గెలిచాయి. RR , LSG నాలుగు సార్లు తలపడగా 3 మ్యాచుల్లో రాజస్థాన్, ఒక మ్యాచులో లక్నో విజయం సాధించాయి.
పరుగుల విందు పంచుతున్న ఐపీఎల్‌ల్లో నేడు రెండు మ్యాచ్‌లు కనువిందు చేయనున్నాయి. డబుల్ హెడర్‌లో భాగంగా తొలిపోరులో ఢిల్లీతో ముంబై తలపడనుండగా.. రెండో మ్యాచ్‌లో లక్నోతో రాజస్తాన్ అమీతుమీ తేల్చుకోనుంది. 5 సార్లు చాంపియన్ ముంబై ఈ సీజన్‌లో నిలకడలేమితో బాధపడుతుంటే.. ఢిల్లీ కూడా పడుతూ లేస్తూ.. సాగుతున్నది. మరోవైపు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రాజస్తాన్ రాయల్స్ జోరుకు బ్రేక్ వేయాలని లక్నో సూపర్ జెయింట్స్ తహతహలాడుతోంది.
ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్..
IPL 17వ సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌కు ముంబై ఇండియాన్స్ సిద్ధమైంది. గుజరాత్‌తో జరిగిన గత మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో విజయం సాధించిన ఢిల్లీ సొంతగడ్డపై మరో విజయం అందుకోవాలని చూస్తుంటే.. రాజస్తాన్ చేతిలో ఖంగుతిన్న ముంబై ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్లేఆఫ్ ఆశలను నిలుపుకోవాలనికుంటోంది. ఢిల్లీ ఆడిన 9 మ్యాచ్‌లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉండగా.. ఆడిన 8 మ్యాచ్‌లో 3 విజయాలతో ముంబై 8వ స్థానంలో కొనసాగుతోంది. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఇరుజట్లకు గెలుపు తప్పనిసరి. బలాబలాల విషయానిక వస్తే.. ఢిల్లీ జట్టులో రిషబ్ పంత్, జేమ్స్ మెక్‌గుర్క్ మంచి ఫామ్‌లో ఉండగా.. ఓపెనర్ పృథ్వీ షా విఫలమవుతున్నాడు. మెదట్లో స్థిరంగా ఆడిన ట్రిసట్న్ స్టబ్స్ టచ్ కోల్పోయి సతమవుతున్నాడు. ఇక గుజరాత్‌తో మ్యాచ్‌లో పించ్ హిట్టర్‌గా వచ్చిన అక్షర్ పటేల్ దుమ్మురేపాడు. దీంతో ముంబైతో మ్యాచ్‌కు అక్షర్ పటేల్ మరోసారి కీలకమయ్యే అవకాశముంది. బౌలింగ్‌లో కొత్తగా వచ్చిన రసిక్ సలామ్ ఆకట్టుకోగా.. ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్‌లు వికెట్లు తీస్తుండటం సానుకూలాంశం. మరోవైపు ముంబై బ్యాటింగ్ విషయానికి వస్తే.. బ్యాటింగ్ విషయంలో అంతంతమాత్రంగానే ఉంది. రోహిత్ శర్మ ఒక మ్యాచ్‌లో ఆడితే మరో మ్యాచ్‌లో విఫలమవుతున్నాడు. తిలక్ వర్మ, నిహాల్ వదేరాలు రాణిస్తున్నప్పటికి.. సూర్య సత్తాచాటాల్సిన అవసరముంది. కెప్టెన్ పాండ్యా బ్యాటింగ్, బౌలింగ్‌లో విఫలమవుతుండటం కలవరపెట్టే అంశం. బౌలింగ్‌లో బుమ్రా, కోట్జీ మాత్రమే రాణిస్తున్నారు.
లక్నో సూపర్ జెయింట్స్ vs రాజస్తాన్ రాయల్స్..
వరుస విజయాలతో జోర మీదున్న రాజస్తాన్ రాయల్స్‌తో పోరుకు లక్నో సూపర్ జెయింట్స్ సిద్ధమైంది. లక్నో వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో ఇరుజట్లు బలంగా ఉండడంతో టఫ్ ఫైట్ జరిగే అవకాశం ఉంది. లీగ్‌లో భాగంగా తొలి అంచె పోటీల్లో లక్నోపై 20 రన్స్ తేడాతో గెలిచిన రాజస్తాన్ రాయల్స్ పైచేయి సాధించింది. దీంతో రేపటి మ్యాచ్‌లో రాజస్తాన్‌పై గెలిచి లక్నో బదులు తీర్చుకోనుందా అన్నది ఆసక్తికరం. రాజస్తాన్ రాయల్స్ ఆడిన 8 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో పట్టికలో టాప్‌లో ఉండగా.. లక్నో ఆడిన 8 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో 4వ స్థానంలో ఉంది. కెప్టెన్ కేహెల్ రాహుల్, డికాక్, పూరన్, దీపక్ హుడాలతో పటిష్టంగా కనిపిస్తోంది. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర సెంచరీతో చెలరేగిన మార్కస్ స్టోయినిస్ ఫామ్‌లోకి రావడం లక్నోకు శుభసూచకం. ఇక బౌలింగ్‌లో రవి బిష్ణోయ్, యష్ ఠాగూర్, మోసిన్ ఖాన్‌లతో పర్వాలేదనిపిస్తున్నారు. ఇక రాయల్స్ బ్యాటింగ్ విషయానికి వస్తే.. కెప్టెన్ శాంసన్‌తో పాటు బట్లర్, జైస్వాల్, పరాగ్, హెట్‌మైర్, పావెల్‌తో పటిష్టంగా కనిపిస్తోంది. ముంబైతో మ్యాచ్‌లో మెరుపు సెంచరీతో జట్టును గెలిపించిన జైస్వాల్ తన ఫామ్‌పై వస్తున్న సందేహాలను పటాపంచలు చేశాడు. ఇక బౌలింగ్‌లో బౌల్ట్, సందీప్, ఆవేశ్ ఖాన్‌లతో కూడిన పేస్ త్రయం రాణిస్తుండగా.. చహల్, అశ్విన్ ద్వయం స్పిన్ బాధ్యతలు మోస్తోంది.