Trending Now

IPL 2024: నేడు ఢిల్లీతో సన్ రైజర్స్ హైదరాబాద్ ‘ఢీ’

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: హ్యాట్రిక్ విజయాలతో ఊపుమీదున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢీకొట్టనుంది. ఢిల్లీ వేదికగా రా.7.30కి మ్యాచ్ జరగనుంది. 6 మ్యాచుల్లో 4 గెలిచిన SRH 4వ స్థానంలో ఉండగా.. ఏడింట్లో 3 గెలిచిన DC 6వ స్థానంలో ఉంది. SRH చివరి 3 మ్యాచుల్లో CSK, PBKS, RCBపై గెలిచింది. బ్యాటర్లు మంచి టచ్‌లో ఉండటంతో మరోసారి భారీ స్కోర్ చేస్తుందని అంచనాలున్నాయి.

చెన్నై ఓటమి.. లక్నో సూపర్ విక్టరీ..

CSKతో నిన్న జరిగిన మ్యాచ్‌లో LSG 8 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. 177 పరుగుల లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది. కేఎల్ రాహుల్ 82, డికాక్ 54 రాణించారు. ముస్తాఫిజుర్, పతిరణ చెరో వికెట్ తీశారు. చెన్నై బ్యాటర్లలో జడేజా 57, రహానే 36, అలీ 30, ధోనీ 28 పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో కృనాల్ 2, స్టొయినిస్, బిష్ణోయ్, మోసిన్ ఖాన్, యశ్ ఠాకూర్ తలో వికెట్ తీశారు.

తేలిపోయిన చెన్నై బౌలర్లు.. ఫ్యాన్స్ అసంతృప్తి..

లక్నోతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై బౌలర్లు తేలిపోయారు. రెండు వికెట్లు తీసేందుకే బౌలర్లు శ్రమించాల్సి వచ్చింది. ముఖ్యంగా తుషార్ దేశ్‌పాండే ప్రదర్శనపై ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 19వ ఓవర్‌లో రెండు వైడ్లు, ఓ నోబాల్ వేయడమే ఇందుకు కారణం. 18వ ఓవర్ ముగిసే సమయానికి లక్నో 12 బంతుల్లో 12 పరుగులు చేయాల్సి ఉంది. కానీ తుషార్ చెత్త ప్రదర్శన వల్ల లక్నోకు మరో ఓవర్ మిగిలి ఉండగానే విజయం వరించింది.

Spread the love

Related News

Latest News