Trending Now

ఆత్రం సుగుణ భారీ మెజార్టీతో గెలవడం ఖాయం..

డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 6 : ఆదిలాబాద్ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీ హరి రావు అన్నారు. మామడ మండలంలోని మామడ, న్యూసాంగ్వి, పోన్కల్, నల్దుర్తి, దిమ్మదుర్తి, లింగాపూర్, గాయత్ పల్లి గ్రామాలలో సోమవారం ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ గారిని భారీ మెజారిటీ తో గెలిపించాలని, రాహుల్ గాంధీ దేశ ప్రధానిని చేయాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామని, ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కేంద్రంలో అధికారంలోకి రావడానికి పని చేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

మే 13న జరిగే ఎన్నికలలో హస్తం పార్టీకి ఓటు వేసి పార్లమెంట్ లో ఆదిలాబాద్ ఎంపీ గా ఆత్రం సుగుణ ను చూడాలని అన్నారు.పేదలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఉపాధి హామి పథకం చట్టం తీసుకొచ్చి వంద రోజులపని కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. పది సంవత్సరాలు పరిపాలించిన బీజేపీ, బీఆర్ఎస్ ల ప్రభుత్వలు ఉపాధి హామి కూలీలను పట్టించుకోలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది.. కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది ఉపాధి హామీ కూలీలకు రోజు వారి కూలీ నాలుగు వందల రూపాయలు చెల్లిస్తుందని అన్నారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మామడ మండల జడ్పీటీఎస్ సోనియా సంతోష్ మండల అధ్యక్షలు అమృత జైసింగ్, పార్టీ మండల అధ్యక్షులు బుజంగా శ్రీనివాస్ రెడ్డి ,మండల పరిషద్ ఉపాధ్యక్షులు ఏనుగు లింగారెడ్డి, మాజీ జడ్పీటీసీ సమీనా రఫీ, మాజీ బ్లాక్ అధ్యక్షులు రమణ రెడ్డి, మాజీ సర్పంచ్ బాపయ్య, పడాల శ్రీనివాస్, నర్సారెడ్డి, మంగు లింగన్న, రత్నయ్య, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News