ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 20 : నిర్మల్ జిల్లా నర్సాపుర్ (జీ )కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి అస్వస్థతకు గురైన బాలికలను శనివారం ఉదయం నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు కుచాడి శ్రీ హరి రావు విద్యార్థినిలను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి సరైన వైద్యం అందించాలన్నారు. అనంతరం ఆయన పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులతో మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విద్యార్థినీలపట్ల, వారి ఆరోగ్య పరిస్తితుల పట్ల ప్రత్యేక శ్రద్ద చూపాలని విధుల పట్ల అలసత్వం వహిస్తే ప్రభుత్వం చూస్తూ ఉరుకోదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ (జి) పార్టీ మండల అధ్యక్షులు గడ్డం ఇంద్రకరణ్ రెడ్డి, నాయకులు ఉమ మహేశ్వర్, అజీమ్, అయన్నగారి మురళి, ఈసవేని మనోజ్ యాదవ్, గాజుల రవి కుమార్ తదితరులు ఉన్నారు.