Trending Now

కరాటే పోటీలను ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు..

ప్రతిపక్షం, నిర్మల్ ప్రతినిధి: నిర్మల్ పట్టణంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో శుక్రవారం జపాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి కరాటే ఎంపిక పోటీలను డీసీసీ అధ్యక్షులు కె. శ్రీహరి రావు ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు, చిన్నారుల ఆత్మరక్షణకు కరాటే ఎంతో దోహదం చేస్తుందని అన్నారు.

చిన్ననాటి నుండి వీటిపట్ల విద్యార్థులు ఆసక్తి చూపాలని అన్నారు. కరాటేలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు పథకాలు ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జపాన్ కరాటే అసోసియేషన్ నాయకులు తేజేంద్ర సింగ్ భాటియా, భూషణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ వైస్ ఎంపీపీ నరేష్ , కాంగ్రెస్ పట్టణ యువజన నాయకులు నందేడపు చిన్ను గాజుల రవి కుమార్, కొంతం గణేష్ , గడ్డింటి ప్రశాంత్ తదితరులున్నారు.

Spread the love

Related News

Latest News