Trending Now

డెంగ్యూ రహిత సమాజ స్థాపనే ద్యేయం..

సిద్దిపేట డీఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్..

ప్రతిపక్షం, సిద్దిపేట, మే 16: డెంగ్యూ రహిత సమాజ స్థాపనే ద్యేయంగా వైద్యా ఆరోగ్య శాఖ పని చేస్తుందని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ అన్నారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా గురువారం నంగునూరు మండలం రాజగోపాలపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందికి ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కిటకజానిత వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందన్నారు. అవగాహన తోనే వ్యాధులు రాకుండా అడ్డుకోవచని తెలిపారు. సీజనల్ వ్యాధుల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రణాళిక బద్దంగా వైద్య సేవలు అందించాలన్నారు. క్షేత స్థాయిలో పని చేసే సిబ్బంది ఎప్పటికపుడు విజిట్స్ చేయాలన్నారు.దోమల వల్ల వచ్చే వ్యాధులను ప్రజలకు వివరిస్తూ ఇంటి పరిసరాల్లో పరిశుభ్రత పాటించెలా చర్యలు చేపట్టాలన్నారు.

డెంగ్యూ కేవలం మంచి నీటి నిల్వలో వృద్ధి చెందుతున్న విషయం చెప్పాలన్నారు. కొబ్బరి చిప్పలు, కులర్స్, ఇంటిలో నీటి నిల్వలు లేకుండా ప్రతి శుక్రవారం డ్రైడే నిర్వహించేలా చూడాలన్నారు. సమాజంలో ఇప్పుడు మార్పు అవసరం ఉందని తెలిపారు. మన చుట్టుపక్కల శుభ్రత పాటిస్తూ పక్క వాళ్ళు పాటించేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా కీటక జనిత సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం డెంగు అవగాహన ర్యాలీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ విజయా రాణి, డాక్టర్ శ్రీదేవి,డాక్టర్ రజని, డాక్టర్ శ్రీకాంత్,పిహెచ్ సి వైద్యాధికారులు డాక్టర్ ప్రవీణ్ నాయక్, డాక్టర్ అంజలి రెడ్డి,సీసీ డానియల్,డెమో నవినరాజ్ కుమార్, ఎన్ విబిడిసిపి హెచ్ఇఓ గాలి రమేశ్, పిహెచ్ సిహెచ్ఇఓ స్వామి, కొండయ్య,సిహెచ్ఓ లు శ్రీనివాస్,హేమలత, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News