ప్రతిపక్షం, నేషనల్: పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట లభించింది. 2018లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై చేసిన అభ్యంతర వ్యాఖ్యలకు గానూ పరువు నష్టం కేసు లో సుల్తాన్ పూర్ కోర్టు రాహుల్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 2018 లో బెంగళూరు లో జరిగిన విలేకరుల సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పై రాహుల్ గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నాయకుడు విజయ్ మిశ్రా పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఓ హత్య కేసులో అమిత్ షా హయాంలో బీజేపీ ప్రమేయం ఉందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. ఈ కేసుపై సుల్తాన్ పూర్ కోర్టు మంగళవారం విచారణ జరిపింది. కేసు విచారణకు నేడు రాహుల్ కూడా హాజరవ్వగా.. రాహుల్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.