ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 3 : బీజేపీ పార్టీ దేశ సంపదను అదానీ, అంబానీ తదిత పెట్టుబడిదారులకు అప్పగించి.. భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసిందని.. ప్రజా సంక్షేమాన్ని, సుస్థిర అభివృద్ధి న గాలికి వదిలి అధికారం కొరకు.. విద్వేషాలు రెచ్చగొడుతూ, సమాజాన్ని విచ్చిన్నం చేసే ప్రయత్నాలు చేస్తున్నదని మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి విమర్శించారు. శుక్రవారం నిజాంబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన బస్సు యాత్రలో అయిన మాట్లాడారు. మోడీని గద్దె దించుదామని కమలం గుర్తు కు ఈ సారి ఓటు వేయవద్దని ఓటర్ల చైతన్య బస్సు యాత్రలో ఆకునూరి మురళి పిలుపు నిచ్చారు. గత పదేళ్ళు గా అభివృద్ధి ని విస్మరించి ప్రజల మధ్యన విద్వేషాలను రెచ్చగొడుతున్న మోడీని ఈ ఎన్నికలలో గద్దెదించాలని జాగో తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి పిలుపునిచ్చారు. జాగో తెలంగాణా, టీడీఎస్ ఏఫ్ అధ్వర్యంలో సాగుతున్న ఓటర్ల చైతన్య బస్సు యాత్ర రెండవ శుక్రవారం నాడు నిజామాబాద్ ఐటీఐ గ్రౌండ్ లో వాకర్స్ తో, కొటగల్లి, బస్టాండ్ సెంటర్ లో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని మారుస్తామని, రిజర్వేషన్ లను ఎత్తివెస్తామని పదే పదే ప్రకటిస్తున్న మోడీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు.
తెలంగాణ రాష్ట్రం నుండి పన్నుల రూపంలో 12 లక్షల కోట్ల ను వసూలు చేసి రాష్ట్రానికి నిధలు ఖర్చు చేయలేదన్నారు. కార్పొరేట్ల అప్పులను రద్దు చెయ్యడం ద్వారా 16 లక్షల కోట్ల ను అదాని,అంబానీ లాంటి కంపెనీలకు దొచిపెట్టరన్నారు. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్ లను ఎత్తివేసెందుకు కుట్ర చెస్తున్న మోడీని ఒడించాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని కి ప్రమాదకరంగా మారి దేవుళ్ళ పేరుతో ఓట్లను అడగటం సిగ్గు చేటన్నారు. సంవత్సారానికి రెండు కొట్ల ఉద్యోగాలను ఇస్తానని, నల్ల ధనాన్ని స్వాధీనం చేసుకొని పేదలకు పంచుతానన్న మోడీ హామీ ని మరిచరన్నారు. బీసీల జనణన చెపట్టడం లేదన్నారు. ఈ బస్సు యాత్రలో ప్రొపెసర్ లు కె. లక్ష్మినారయణ, ప్రొ”పద్మజాషా, వీ ప్రభాకర్ (సీపీఐ ఎంఎల్-ప్రజాపంథా మాస్ లైన్ రాష్ట్ర నాయకులు) ఆకుల పాపన్న (సీపీఐ(ఎంఎల్)న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు)డీబీఎఫ్ శంకర్, నైనాల గోవర్దన్, రాయదాస్, పులి కల్పన ,నిర్మల,స్వరూప,శ్రీకాంత్గౌతమ్,శ్రీను,కళాకారులు గౌస్,రాము,అంజి,వినయ్,శివ,తదితరులు పాల్గొన్నారు.
నేడు నిర్మల్‌లో మేలుకో తెలంగాణ ప్రజాస్వామ్యక వేదిక బస్సు యాత్ర..
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ ట్యాంక్బండ్ వద్ద శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు మేలుకో తెలంగాణ ప్రజాస్వామ్య వేదిక బస్సు యాత్ర ఉంటుందని నాయకులు తెలిపారు. శాసనసభ ఎన్నికలలో బీఆర్ఎస్ ను మట్టి కరిపించిన ఈ బస్సు యాత్ర తిరిగి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాకుండా ఉండేందుకు సుమారు వారం రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో పర్యటిస్తూ ప్రజలలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను అవగాహన పరుచుతూ ముందుకెళ్తుంది. ఈ కార్యక్రమానికి ప్రజాస్వామ్యవాదులు, విద్యార్థులు, ప్రజాసంఘాల నాయకులు, లౌకికవాదులు, విద్యావంతులు ,కుల మతాలకు అతీతంగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.